'సమత' హత్యాచారం కేసులో ఛార్జిషీటు దాఖలు

  • ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ
  • సోమవారం నుంచి విచారణ ప్రారంభం
  • సమత భర్తకు ప్రభుత్వ ఉద్యోగం 
కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని లింగాపూర్‌ మండలం ఎల్లపటూర్‌ గ్రామానికి చెందిన మహిళ 'సమత'పై గత నెల కొందరు మృగాళ్లు అత్యాచారం చేసి, హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈ రోజు ఛార్జిషీటు దాఖలైంది. ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో 44 మంది సాక్షులతో కుమురం భీం జిల్లా ఎస్పీ మల్లారెడ్డి ఛార్జీషీటు దాఖలు చేశారు. సోమవారం నుంచి ఈ కోర్టులో విచారణ ప్రారంభం కానుంది.

 కాగా, ఈ కేసులో మృతురాలి ఇద్దరు పిల్లలను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చేర్పించారు. అలాగే, 'సమత' భర్తకు ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబానికి ప్రతినెలా పెన్షన్‌, రెండు పడకగదుల ఇల్లు ఇవ్వనున్నారు.

Go Back to Shorts
Police
samata
Kumaram Bheem Asifabad District

More Telugu News